హైదరాబాద్‌లో ‘వెంకీ మామ’ సందడి

ఇద్దరు హీరోలు కలిసి వెండి తెరపై కనిపిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఆ హీరోలిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లైతే డబుల్‌ బొనాంజా దక్కినట్టే. ఇప్పుడు ‘వెంకీ మామ’తో అదే జరుగుతోంది. వెంకటేష్‌, నాగచైతన్య కలసి నటిస్తున్న చిత్రమిది. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీ ఖన్నా నాయికలు. బాబీ దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు నిర్మిస్తున్నాయి. గురువారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలైంది. వెంకీ, చైతూలపై కొన్ని కీలక సన్నివేశాల్నితెరకెక్కిస్తున్నారు. ‘‘వెంకటేష్‌, నాగ చైతన్యలను ఒకేసారి వెండి తెరపై చూడడం అభిమానులకు కనుల విందుగా ఉంటుంది. వాళ్ల పాత్రల్ని కూడా చక్కగా తీర్చిదిద్దాం. కుటుంబ బంధాలతో సాగే వినోదాత్మక కథ ఇది. ఎవరి ఊహకూ అందని కొత్త అంశాలూ ఉన్నాయ’’ని చిత్రబృందం తెలిపింది. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.