ముద్దు సీన్లను మా వ్యక్తిగత జీవితాలకు ముడిపెట్టొద్దు

‘‘లి
ప్‌లాక్‌ సీన్స్‌ మా వ్యక్తిగత జీవితాలను బలి చేస్తున్నాయి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. తాజాగా ఆయన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జులై 26న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుందీ చిత్రం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో రష్మిక - విజయ్‌ల మధ్య వచ్చిన ముద్దు సన్నివేశాలకు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఇదిలా ఉండగా.. వీటిని ఆధారంగా చేసుకోని విజయ్‌ - రష్మికల మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై విజయ్‌ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘‘సినిమాలోని పాత్రలను పండించడానికే ముద్దు సన్నివేశాల్లో నటిస్తాం. అంతేకానీ, మా వ్యక్తిగత విషయాలకు ఆ సీన్స్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయితే కొందరు మాత్రం ఆ లిప్‌లాక్‌ సీన్లను మాకు వ్యక్తిగతంగా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సీన్లలో నటిస్తే చాలు ఎఫైర్‌ అంటూ ప్రచారం షురూ చేసేస్తున్నారు. ఇక్కడ ప్రతిఒక్కరం సినిమా బాగా రావాలనే కష్టపడతాం. కొన్నిసార్లు పాత్రలు పండించడానికి ఇష్టం లేకున్నా ముద్దు సీన్స్‌లో నటించాల్సి వస్తుంది. కానీ, ఆ ముద్దు సీన్లే మా జీవితాలను బలి చేస్తున్నాయి. వీటిని ఆధారంగా చేసుకోని మా వ్యక్తిగత జీవితాలపై మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా ప్రచారాలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దయ చేసి సినిమాను సినిమాలాగే చూడండి. అందులో సీన్లతో మా వ్యక్తిగత జీవితాలకు ముడిపెట్టొద్దు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రౌడీ హీరో.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.