విజయ్‌కు ప్రతినాయకుడుగా విజయ్‌ సేతుపతి?

విజయ్, విజయ్‌ సేతుపతి.. ఇద్దరూ ఇద్దరే. కోలీవుడ్‌ స్టార్‌ కథానాయకులు. త్వరలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ తమిళ తెరకెక్కబోతుందట. అది కూడా ఒకరు కథానాయడు, మరొకరు ప్రతినాయకుడు. య³వ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నాడని కోలీవుడ్‌ టాక్‌. యాక్షన్‌ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో విలన్‌గా విజయ్‌ సేతుపతి అయితేనే బావుంటుందని, ఇప్పటికే ఇద్దరికి కథ చెప్పి దర్శకుడు ఓకే చెప్పించే పనిలో ఉన్నాడని సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం విజయ్‌ అట్లీ దర్శకత్వంలో ‘బిగిల్‌’ చిత్రాన్ని చేస్తున్నాడు. విజయ్‌ సేతుపతి ఇటు తెలుగు, అటు తమిళ్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అవి పూర్తయైన తర్వాత చేస్తారేమో చూడాలి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.