విజయశాంతి ఫస్ట్‌లుక్‌ వచ్చేది అప్పుడేనా?

సుమారు 13ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది ప్రముఖ నటి విజయశాంతి. మహేష్‌బాబు కథానాయకుడుగా దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా. చిత్రం ప్రారంభ సమయంలో విజయశాంతి నటిస్తుందని అభిమానుల్లో ఆసక్తి పెంచిన చిత్ర బృందం ఇప్పటికి వరకు ఆమె ఏ పాత్రలో నటిస్తుందో చెప్పలేదు. విజయశాంతి సెట్స్‌లో అడుగుపెట్టిన మొదటి రోజు ముఖం పూర్తిగా కనిపించకుండా అద్దంలో కనిపించే ఆమె ప్రతిబింబాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అంతకుమించి ఎలాంటి ఫొటోను ఇప్పటికి వరకు విడుదల చేయలేదు. దీంతో ఎప్పుడెప్పుడు తమ అభిమాన నటిని చూడాలా అని ఎదురుచూస్తున్నారు ఆమె అభిమానులు. అందుకే దీపావళి సందర్భంగా ఈ చిత్రంలోని విజయశాంతి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నారని టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన మహేష్‌ లుక్స్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరి ఈసారైనా విజయశాంతి లుక్‌ను రిలీజ్‌ చేస్తారా? మహేష్‌ లుక్కా? అనేది సందేహమే.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.