‘ప్రేమదేశం’ వినీత్‌ పుట్టినరోజు

ప్రముఖ నటుడు, నృత్యకారుడు వినీత్‌ అంటే దక్షిణాది సినీపరిశ్రమలో తెలియనివారుండరు. వినీత్‌ ఒక మంచినటుడుగానే కాదు, క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. ‘ఇదనిళంగళ్‌’ (1985) మలయాళి చిత్రం వెండితెరకు పరిచయం అయ్యారు. మాతృభాషలో చాలా చిత్రాల్లో నటించి తరువాత 1992లో ‘ఆవరామ్‌పూ’ చిత్రంతో తమిళంలోకి అడిగిపెట్టాడు. ‘ఆరోప్రాణం’ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఇక అక్కడి నుంచి తమిళంలో వచ్చిన ప్రతి చిత్రం దాదాపుగా తెలుగులోను వస్తుంది. 1996లో ‘కాదల్‌ దేశం’ సినిమా తెలుగులో ‘ప్రేమదేశం’గా వచ్చింది. ఇందులో టబు, అబ్బాస్‌లు నటించారు. అప్పటి నుంచి యువప్రేక్షకుల్లో వినీత్‌ అభిమాన హీరో అయ్యాడు. రజనీకాంత్‌ నటించిన ‘చంద్రముఖి’లో జ్యోతికతో కలిసి నాట్యం చేస్తాడు. వినీత్‌ది తొలి నుంచి కళాకారుల కుటుంబమే. ఒకప్పటి ట్రావెన్‌కోర్‌ సోదరీమణుల్లో ఒకరైన పద్మిని భర్త రామచంద్రన్‌ నాయర్‌కు మేనల్లుడు అవుతాడు వినీత్‌. ఆ విధంగా నటి, నృత్యకారిణి శోభన కూడా వినీత్‌కి బంధువే. ఈ సంవత్సరంలో వచ్చిన తమిళ చిత్రం ‘సర్వం తాళమయం’లో మణి పాత్రలో నటించారు. ఈ రోజు వినీత్‌ పుట్టినరోజు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.