4 ఏళ్ల విరామం తర్వాత..

సుమారు నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ నటించబోతున్నారు ప్రముఖ నటి గౌతమి. విశాల్‌ కథానాయకుడుగా దర్శకుడు మిస్కన్‌ తెరకెక్కిస్తున్న ‘తుప్పరివాలన్‌ 2’లో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో వచ్చిన ‘తుప్పరివాలన్‌’ కు సీక్వెల్‌గా వస్తున చిత్రమిది. తొలి భాగంలో సిమ్రన్‌ అతిథి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు గౌతమి అలరించబోతున్నారు. 2015లో వచ్చిన ‘పాపనాశం’ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ‘తుప్పరివాలన్‌’ తెలుగులో ‘డిటెక్టివ్‌’గా విడుదలైంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.