ఇకపై సినిమాలు తీయను



ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ ఆరోగ్యంపై గతంలో విభిన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన్ను తెలంగాణ ముఖ్యమంత్రి కలవడంతో మళ్లీ ఆ అంశం తెరమీదకు వచ్చింది. ముఖ్యమంత్రి మిమ్మల్ని కలవడాన్ని ఎలా భావిస్తున్నారన్న ప్రశ్నకు స్పందించారు విశ్వనాథ్‌.‘నా ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. నా అభిమానిగా కేసీఆర్‌ నన్ను కలవడానికి వచ్చారు తప్ప ఎలాంటి ఉద్దేశం లేద’ని బదులిచ్చారు. అంతేకాదు ‘కుచేలుడి ఇంటికి శ్రీ కృష్ణుడు వచ్చినట్లు ఉంద’ని అభివర్ణించారు. వయోభారంతో ఓపిక తగ్గింది. ఇకపై సినిమాలు తీయను అని వెల్లడించారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.