‘90 ఎంఎల్‌’తో రెచ్చిపోయిన ఓవియా..

తమిళ బిగ్‌బాస్‌తో ఫేమస్‌ అయిన తర్వాత ఓవియా నటిస్తున్న తొలి చిత్రం ‘90 ఎంఎల్‌’. అనితా ఉదీప్‌ దర్శకత్వంలోని ఈ చిత్రంలో ‘రెమో’ ఫేమ్‌ ఆన్సన్‌ పాల్‌ ముఖ్యపాత్ర పోషించారు. స్టార్‌ హీరో శింబు అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇదో లేడీ అడల్ట్‌ మూవీగా రూపొందించినట్లు టీజర్‌ను చూస్తుంటే అర్థమవుతోంది. అమ్మాయిలంతా అసభ్యకరంగా మాట్లాడటం, ఉమ్మడిగా కూర్చుని మద్యం తాగడం, పొగ తాగడం వంటి సన్నివేశాలు ట్రైలర్‌లోనే పదే పదే కనిపించాయి. ఇందులో వినిపించిన డబుల్‌ మీనింగ్‌ డైలాగులు అబ్బాయిల అడల్ట్‌ చిత్రాలను మించేపోయేలా ఉన్నాయని కొందరు నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు. ఓ మహిళా దర్శకురాలు ఇలాంటి సినిమానా..? అని ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా ఓవియా ఆర్మీ కూడా ఆశ్చర్యపోయేలా ఉందీ ట్రైలర్‌. ‘రేయ్‌.. నేను బిగ్‌బాస్‌నే చూసినదాన్నిరా..!’ అంటూ ఓవియా చెప్పిన సంభాషణతో ట్రైలర్‌ మొదలైంది. అంతేకాదు ‘ఓన్లీ 18+, ‘హెడ్‌ ఫోన్స్‌ వాడండి’ అని ప్రస్తావించడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.