ఇది లిక్కర్‌తో నడిచే బండి గుద్దితే అడ్రస్‌ ఉండదు..

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేం కార్తికేయ ప్రస్తుతం అధికారిక గుర్తింపు పొందిన తాగుబోతుగా మారాడు. అలాగని నిజ జీవితంలో కాదులేండి. ‘90 ML’ చిత్రం కోసం. ఆయన నటిస్తున్న ఈ కొత్త చిత్రంలో తాగుబోతు పాత్రలో కనిపించనున్నాడు. యాన్‌ ఆథరైజ్డ్‌ డ్రింకర్‌ అనేది ఉప శీర్షిక. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘'అరెయ్‌ డీజిల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్‌.. పెట్రోల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్‌.. ఇది లిక్కర్‌తో నడిచే బండి. గుద్దితే అడ్రస్‌ ఉండదు’' అంటూ ఈ చిత్రంలో తన పాత్ర తీరును ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో పరిచయం చేశాడు కార్తికేయ. ఈ ప్రచార చిత్రంలో ‘'డైలీ ఎంత వేస్తావ్‌..’' అని అలీ అడగ్గా '‘పూటకో 90ఎంఎల్‌ సార్‌..’' అని కార్తికేయ చెబుతారు. వెంటనే అలీ ‘'ఏ క్వార్టర్‌ ఇస్తే తాగవా?'’ అని ప్రశ్నించగా.. ‘'డాక్టర్‌ 90 మాత్రమే తాగమన్నారు.’' అంటూ హీరో చెప్పిన సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. రావు రమేష్‌, పోసాని, అజయ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.