‘అల.. వైకుంఠపురములో’ నుంచి వచ్చిందో కానుక

‘జు
లాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి హిట్ల తర్వాత అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ల కలయికలో ముచ్చటగా మూడో చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ చిత్ర టైటిల్‌, మైక్రో టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. తివిక్రమ్‌ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకూ ‘‘అల.. వైకుంఠపురములో’’ అనే చక్కని తెలుగు టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక టీజర్‌ విషయానికొస్తే.. అల్లు అర్జున్‌ లుక్స్‌ డైలాగ్‌ డెలివరీ ఆకట్టుకునేలా ఉన్నాయి. మురళీ శర్మ బన్నీ తండ్రిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘‘ఏంట్రోయ్‌ గ్యాప్‌ ఇచ్చావ్‌..’’ అంటూ మురళీ తదేకంగా చూస్తున్న బన్నీని అడగ్గా.. ‘‘ఇవ్వలే.. వచ్చింది’’ అంటూ ఓ పంచ్‌ వేసి వెళ్లిపోవడం టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. తమన్‌ బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఎంతో వినసొంపుగా అనిపించింది. ఇందులో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.. సుశాంత్‌, టబు, తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.