అదరగొడుతున్న ‘విజిల్‌’ తెలుగు ట్రైలర్‌

అట్లీ దర్శకత్వంలో తమిళ అగ్రనటుడు విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘బిజిల్‌’. తెలుగులో ఈ సినిమా ‘విజిల్‌’ పేరుతో విడుదలవుతుంది. నయనతార కథానాయిక. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో విజయ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా కనిపించి అభిమానుల్ని అలరించాడు. నయనతార, విజయ్‌ మధ్య వచ్చే సీన్స్‌ కనువిందు చేస్తున్నాయి. యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుందీ ట్రైలర్‌. ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయంలో దర్శనమివ్వబోతున్నాడు. బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అట్లీ- విజయ్‌ కాంబినేషన్‌లో గతంలో తెరీ, మెర్సల్‌ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

                         


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.