‘బ్రోచేవారెవరురా’ నవ్వుల సందడి చూశారా!!

‘మెంటల్‌ మదిలో’ వంటి హిట్‌తో తొలి అడుగులోనే దర్శకుడిగా సత్తా చాటుకున్నాడు వివేక్‌ ఆత్రేయ. తాజాగా ‘బ్రోచేవారెవరురా’ అంటూ దిగ్విజయంగా ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించేశాడు. చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల సమయం నుంచి ట్రైలర్‌ రిలీజ్‌ వరకు ప్రతిదాంట్లో వైవిధ్యతను ప్రదర్శించిన ఈ సినిమా.. కథా కథనాల పరంగానూ విభిన్నంగా ఉండటంతో సినీప్రియులకు చక్కటి అనుభూతిని అందించింది. ఇక ఈ సినిమాలో ‘ఆర్‌ త్రీ బ్యాచ్‌’గా శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలు చేసిన అల్లరి, కామెడీ పోలీస్‌ అధికారిగా నటుడు విష్ణు వర్ధన్‌ పంచిన నవ్వులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. తాజాగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో.. ఈ చిత్రంలోని వీరికి సంబంధించిన మరిన్ని డిలేటెడ్‌ సీన్స్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఇవి నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ డిలేటెడ్‌ సీన్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి..














Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.