ఆకట్టుకొంటున్న ‘చిత్రలహరి’ టీజర్‌

సాయిధరమ్‌ తేజ్‌ , కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్‌ జంటగా కిషోర్‌ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘చిత్రలహరి’. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై ఎమోషనల్‌ ప్రేమ కథ గా ఏపిల్‌ 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో తేజూ సరికొత్త లుక్‌ లో కనిపించడమే కాదు అయన క్యారెక్టర్‌ కొత్తగా ఉంది. సునీల్‌ మరోసారి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించబోతున్నారు. దర్శకుడు సుకుమార్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన టీజర్‌లో నివేదా పేతురాజ్‌తో పాత్రల పరిచయం మొదలైంది. తేజూ పాత్ర పేరు విజయ్‌. తన పేరులో ఉన్న విజయం తన జీవితంలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూ ఉండే పాత్ర ఇది.మొత్తం దేవి శ్రీ సంగీతం సంగీత ప్రియలను అలరిస్తుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.