ఆసక్తిరేకెత్తిస్తున్న ‘దొంగ’ టీజర్‌

టీవలే ‘ఖైదీ’గా ప్రేక్షకుల్ని పలకరించిన కార్తి.. ఇప్పుడు ‘దొంగ’లా సందడి చేయబోతున్నారు. అంతేకాదు ఈ చిత్రంతో తొలిసారిగా తన వదిన జ్యోతికతో కలిసి అలరించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో ఆమె కార్తికి అక్కగా కనిపించబోతుంది. ‘దశ్యం’ ఫేం జీతూ జోసఫ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుల చేశారు. ‘‘అతని పేరేం చెప్పాడు’’ అని ఓ పోలీస్‌ అధికారి కార్తిని గురించి మరకొరిని ప్రశ్నించగా.. ‘‘విక్కీ, గురు అర్జున్‌.. ఒకొక్క కేసుకు ఒకో పేరు’’ అంటూ అతని గురించి చెప్పే సన్నివేశాలతో టీజర్‌ మొదలైంది. ‘‘పార్వతి తమ్ముడు వస్తాడమ్మా.. తప్పకుండా వస్తాడు’’ అంటూ జ్యోతికతో సత్యరాజ్‌ చెప్పడం ఆసక్తికరంగా అనిపించింది. ‘‘ప్రేమ అన్నింటినీ మార్చేస్తుంది సర్వా. నిన్ను మార్చింది. నన్నూ మార్చింది’’ అని కార్తితో జ్యోతిక చెప్పిన డైలాగ్‌ మనసులను హత్తుకునేలా ఉంది. చివర్లో ఓ వ్యక్తి జ్యోతికపై దాడి చేసేందుకు సిద్ధమవ్వగా.. మా అక్కపైనే చెయ్యి ఎత్తుతావా అంటూ కార్తి యాక్షన్‌లోకి దిగడం టీజర్‌కే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ టీజర్‌లో ఆయన రెండు భిన్నమైన లుక్స్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.