ఉత్కంఠభరితంగా ‘ఎవరు’ టీజర్‌

టుడిగా, రచయితగా వరుస హిట్లతో సత్తా చాటుతున్నాడు అడవి శేష్‌. 
ప్రస్తుతం ఈ యువ హీరో ‘ఎవరు’ అంటూ ఓ సర్‌ప్రైజ్‌ ప్రాజెక్టుతో ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. వెంకట్‌ రాంజీ దర్శకత్వంలో గుట్టుచప్పుడు కాకుండా ఈ సినిమాను తెరకెక్కించారు. పీవీపీ సంస్థ నిర్మించింది. రెజీనా కథానాయికగా నటించగా.. నవీన్‌ చంద్ర ఓ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. రెజీనాపై నవీన్‌ చంద్ర అత్యాచారానికి ప్రయత్నించడం.. అతన్ని ఆమె దారుణంగా హత్య చేయడం వంటి సన్నివేశాలతో టీజర్‌ ఆసక్తికరంగా మొదలైంది. అడివి శేషు ‘విక్రమ్‌’ అనే తమిళ పోలీసు అధికారి పాత్రలో కనిపించారు. ‘నిజాలు మాట్లాడుకుందామా?’ అంటూ ఆయన రెజీనాను విచారిస్తూ కనిపించాడు. ‘పోలీసులు హత్య అంటున్నారు, మీరు రేప్‌ అంటున్నారు. రెండూ నిజాలు కాకపోతే..’ అని శేష్‌ ప్రశ్నిస్తున్న ఈ టీజర్‌ ఉత్కంఠగా ముగిసింది. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.