‘గుణ 369’ టీజర్‌ వచ్చేసింది

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో యువతరంలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు యువ హీరో కార్తికేయ. ఇటీవలే ‘హిప్పీ’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ కుర్ర కథానాయకుడు ఇప్పుడు ‘గుణ 369’ సినిమాతో అలరించేందుకు ముస్తాబవుతున్నాడు. అర్జున్‌ జంధాల్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అనిల్‌ కడియాల, తిరుమల రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనఘా కథానాయికగా నటిస్తోంది. తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. దీన్ని చూస్తుంటే ఓ సరికొత్త లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథాంశంతో చిత్రాన్ని రూపొందించినట్లు అర్థమవుతోంది. ‘‘మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం అయినా పర్లేదు. కానీ, పక్కనోడి జీవితానికి ఏం జరగకూడదు’’ అంటూ సాయి కుమార్‌ వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ ఆసక్తికరంగా మొదలైంది. నచ్చిన అమ్మాయి మనసు గెలుచుకోవాలని తాపత్రయపడే యువ ఉద్యోగిగా కార్తిక్‌ పాత్ర బాగుంది. అనఘా ఫ్రెష్‌ లుక్స్‌తో ఆకట్టుకునేలా కనిపించింది. యాక్షన్‌ సీన్స్‌ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.