లాయర్‌ ‘తెనాలి రామకృష్ణ’ని చూశారా?

‘ఒక కేసు ఇస్తే రెండో కేసు ఫ్రీ. పేటీఎమ్‌లో పే చేస్తే 50శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌. ఒకవేళ కేసు ఓడిపోతే 100శాతం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌’ అంటూ ఆఫర్‌ మీద ఆఫర్‌ ఇచ్చేస్తున్నాడు సందీప్‌ కిషన్‌. తన నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.ఎల్‌’ చిత్రం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఆయన కథానాయకుడుగా నటిస్తున్న చిత్రమిది. హన్సిక కథానాయిక. తమిళ నటి వరలక్ష్మి శరత్‌ కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. కామెడీ ప్రధానంగా రూపొందించిన ఈ టీజర్‌ అందరిని ఆకట్టుకుంటుంది. సందీప్‌, ఇతర హాస్య నటుల టైమింగ్‌ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి...
                          
                                       


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.