ఆ రహస్యం ‘మీకు మాత్రమే చెప్తా’డట

యువ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఎ కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌ ప్రొడక్షన్‌ పతాకంపై నటుడు విజయ్‌ దేవరకొండ, వర్థన్‌ దేవరకొండ నిర్మిస్తున్నారు. తాజాగా ప్రచార చిత్రాన్ని ప్రముఖ కథానాయకుడు మహేష్‌ బాబు విడుదల చేశారు. హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ గాత్రంతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌ కడుపుబ్బా నవ్విస్తుంది. ‘మన లైఫ్‌ మన చేతిలో ఉందో లేదో కానీ మనందరి చేతిలో కచ్చితంగా ఫోన్‌ ఉంటుంద’ని కిశోర్‌ చెప్పే డైలాగ్‌.. కథ ఫోన్‌ నేపథ్యంలో సాగుతుందని తెలియజేస్తుంది. తరుణ్‌ హావభావాలు అలరిస్తున్నాయి. చిరవగా ప్రతి ఫోన్‌ ఓ సీక్రెట్‌ ఉంటుంది. ఉంటదా? ఉండదా? అంటూ ముగుస్తుంది ట్రైలర్‌. ఇంతకీ మన కథానాయకుడి రహస్యం ఏంటో తెలియాలంటే కొంతకాలం చూడాల్సిందే. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

                               


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.