బేసిక్‌గా నేను చాలా మంచోణ్ని!

‘నా గురించి తప్పుగా ఆలోచించొద్దురా. బేసిక్‌గా నేను చాలా మంచోణ్ని’ అంటున్నాడు తరుణ్‌ భాస్కర్‌. యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ నిర్మిస్తున్న ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు తరుణ్‌. తాజాగా ఆ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో తరుణ్‌ చెప్పే డైలాగులు, ఆయన హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాతో యువత ఏం పనులు చేస్తుందో చెప్పే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు ఉంది టీజర్‌ చూస్తుంటే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ హైలెట్‌గా నిలుస్తుంది. ప్రముఖ నటి,యాంకర్‌ అనసూయ కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజర్‌ హుషారుగా సాగడంతో అన్ని వర్గాల వారిని అలరించేదిగా ఉంది. గతంలో తరుణ్ భాస్కర్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ‘పెళ్లి చూపులు’ చిత్రంలో నటించాడు. ఇప్పుడు విజయ్‌ నిర్మాతగా తరుణ్‌ హీరో అవ్వడం విశేషం.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.