వెంకీ చేతుల మీదుగా...

‘ఆటగదరా శివ’ చిత్రంతో ఆకట్టుకున్న కథానాయకుడు ఉదయ్‌ శంకర్‌. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అయ్యాడు. ఉదయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఎన్వీ నిర్మల్‌ కుమార్‌ దర్శకుడు. ఐశ్వర్యరాజేష్‌ కథానాయిక. శ్రీరామరాజు, భరత్‌రామ్‌ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధమైంది.  ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌ ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ‘‘ప్రేమలోని సరికొత్త అనుభూతుల్ని ఆవిష్కరించే చిత్రమిది. అబ్బాయి అమ్మాయి మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా ఉంటుంది. యువతకే కాదు, ఇంటిల్లిపాదికీ నచ్చే అంశాలున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ‘తొలిప్రేమ’లోని సూపర్‌ హిట్‌ గీతం ‘నీ మనసే..’ని ఈ సినిమా కోసం రీమిక్స్‌ చేశాం. ఆ పాట పవన్‌ అభిమానులకు ప్రత్యేకం’’ అని చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.










Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.