‘నన్ను దోచుకుందువటే’ ట్రైలర్ వచ్చేసింది

‘సమ్మోహనం’ చిత్రంతో ఇటీవలే ఓ చక్కటి విజయాన్ని అందున్నాడు కథానాయకుడు సుధీర్‌బాబు. ఇప్పుడీ యువ హీరో నిర్మాతగానూ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా సుధీర్‌ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఆర్‌ఎస్‌ నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కన్నడ నటి నభా నతీష్‌ కథానాయికగా నటిస్తోంది. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌, టీజర్‌లకు మంచి స్పందన రాగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. సుధీర్‌బాబు చాలా స్ట్రిక్ట్‌గా ఉండే కార్తీక్‌ అనే ఓ కంపెనీ మేనేజర్‌గా కనిపించబోతున్నాడు. ‘‘సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సిరి’’ అంటూ కథానాయిక నభా నతీష్‌ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. మరి ఆఫీస్‌లో ఇంత స్ట్రిక్ట్‌గా ఉండే కార్తీక్‌ జీవితంలోకి సిరి ఎలా వచ్చింది? వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.© Sitara 2018.
Powered by WinRace Technologies.