‘నిశ్శబ్దం’ జవాబు చెపుతుందా?

ఆమె ఒక చిత్రకారిణి. అతను ఒక గిటార్‌ ప్లేయర్‌. ఇద్దరూ కలసి అమెరికాలో సరదాగా సెలవులు గడపడానికి వెళ్లారు. అక్కడ అనుకోని సంఘటనలు వారి జీవితాన్నే మార్చేశాయి. వారికి ఎవరు ఎదురు పడ్డారు, ఏం జరిగిందో అనుష్క పోలీసులకు వివరిస్తుంది కాని మాటలతో కాదు చేతలతో. చిత్రం పేరుకు తగ్గట్టే మాటలు లేకుండా ‘నిశ్శబ్దం’గానే సాగింది టీజర్‌. టీజర్‌లో అనుష్క హావాభావాలు అద్భుతంగా ఉన్నాయి. ఉత్కంఠభరితంగా సాగే టీజర్‌లో నేపథ్య సంగీతం బాగుంది. విభిన్న తరహా థ్రిల్లర్‌ చిత్రం అని టీజర్‌ చెపుతుంది. అంజలి క్రైమ్‌ డిటెక్టివ్‌ అధికారిగా నటిస్తోంది. షాలీని పాండే, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రేపు స్వీటీ పుట్టినరోజు సందర్భంగా ‘నిశ్శబ్దం’ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్ర టీజర్‌ను తెలుగులో మాస్‌ దర్శకుడు పూరి జగన్నాథ్, తమిళంలో క్లాస్‌ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ వాసుదేవ్‌ విడుదల చేశారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.