ఏ చోట నువ్వున్నా..




ప్రభాస్‌ రొమాంటిక్‌ కోణాన్ని ఆవిష్కరించాడు. ‘నిన్నలు మరిచేలా నిన్ను ప్రేమిస్తాలే... నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే’ అంటూ శ్రద్ధాకపూర్‌తో ప్రేమ గీతాన్ని పాడుకోబోతున్నాడు. ప్రభాస్‌, శ్రద్ధ జంటగా నటిస్తున్న ‘సాహో’లోని ఆ గీతానికి సంబంధించిన వీడియో విడుదల చేశారు. సుజీత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ఆగస్టు 30న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘‘ఇప్పటివరకు సాగిన ‘సాహో’ ప్రచారంలో యాక్షన్‌ హంగామానే ఎక్కువ. ఈ గీతంతో ప్రేమ, రొమాంటిక్‌ కోణం కూడా కనిపిస్తుంది. కథలో ఇంకా పలు కోణాలు ఉన్నాయి. వాటన్నింటినీ విడుదల తేదీలోపు బయటికి తీసుకొస్తాం. అత్యున్నత ప్రమాణాలు, సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న చిత్రమిది. ఒక్కో పాటని ఒక్కో సంగీత దర్శకుడు స్వరపరిచారు. ‘నిన్నలు మరిచేలా...’ గీతానికి గురు రాంధ్వా స్వరాలు సమకూర్చగా, కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. హరిచరణ్‌ శేషాద్రి, తులసి కుమార్‌ ఆలపించారు. యూరప్‌లో ఈ పాటని తెరకెక్కించాం. ఆగస్టు 2న పూర్తి పాటని విడుదల చేస్తామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.