పండగ చేసేందుకు వచ్చేశాడు


యువ కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. రాశిఖన్నా కథానాయిక. సాయిధరమ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో సంభాషణలు వినిపించకపోయినా, సత్యరాజ్‌, సాయి మధ్య బంధాన్ని చక్కగా చూపించారు. తమన్‌ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. యువీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

                                     


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.