అవంతిక‌... ఎ స‌ర్టిఫికెట్‌

ప‌ద్ధ‌తైన పేరు. తీరు కూడా అంతే. అంద‌రూ `ఆ అమ్మాయి చ‌ల్ల‌గాలిలాంటిది` అంటూ సుకుమారంగా చూస్తుంటారు. కానీ ఆమెలో మ‌రో యాంగిల్ కూడా ఉంది. అది ఎ స‌ర్టిఫికెట్ యాంగిల్‌. ఆ యాంగిల్‌లో ఆమె ఎలా రెచ్చిపోయిందో తెలియాలంటే మాత్రం `మ‌న్మ‌థుడు2` చూడాల్సిందే. నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్ర‌మిది. ర‌కుల్‌ప్రీత్ సింగ్ క‌థానాయిక‌. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆమె పాత్ర‌ని ప‌రిచ‌యం చేసే ప్రచార చిత్రాన్ని మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు. అందులో నాగార్జున‌, ర‌కుల్ చేసే సంద‌డి ఆక‌ట్టుకొంటోంది. ర‌కుల్ ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తూ, ట్రెండీ అవ‌తారాన్ని చూపించింది. విజ‌య‌వంత‌మైన `మ‌న్మ‌థుడు`కి కొన‌సాగింపుగా రూపొందిన చిత్ర‌మిది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.