పిల్లల్ని చంపుతోన్న ఆ సైకో కిల్లర్‌ ఎవడు?

టీవలే ‘సీత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు ‘రాక్షసుడు’గా అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తోంది. తమిళ హిట్‌ మూవీ ‘రాచ్ఛసన్‌’కు తెలుగు రీమేక్‌ ఇది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నేనంటే భయానికే భయం.. నా గురించి వెతకొద్దు’ అంటూ ఓ సీరియల్‌ కిల్లర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అయిన బెల్లకొండ శ్రీనివాస్‌కు వార్నింగ్‌ ఇస్తున్న డైలాగ్‌లో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగింది. ఇంతకీ ఆ హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? వాడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు? ఈ నేపథ్యంలో కథానాయకుడికి ఎదురైన సంఘనటలు ఏవి? మొత్తం తెరపై చూడాల్సిందే. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రాక్షసుడు’ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.