శివగామి జయలలితగా మారిన వేళ..

శివగామి జయలలితగా మారడం ఏంటంటే? జయలలిత జీవిధారంగా పలు చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొన్ని వెబ్‌ సిరీస్‌లూ ఉన్నాయి. ఈ కథాంశంతోనే రమ్యకృష్ణ నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘క్వీన్‌’. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రమ్యకృష్ణ ముఖం కనిపించకుండా కేవలం హావభావాలతోనే టీజర్‌ను రూపొందించారు. ‘పాఠశాల రోజుల్లో స్టేట్‌ టాపర్‌, 18 ఏళ్లకే స్టార్‌ హీరోయిన్‌, చిన్న వయసులోనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ‘క్వీన్‌’ మీకోసం ఎదురు చూస్తుంద’ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ నెల 5న ట్రైలర్‌ విడుదల కానున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ ఆసక్తి పెంచింది. ఇప్పుడు టీజర్‌ తోడవడంతో ఈ వెబ్‌ సిరీస్‌పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.