అదరగొడుతున్న ‘రణరంగం’ ట్రైలర్‌

‘‘కోపాన్ని.. దాహాన్ని ఇంకొకరు శాసించే స్థితిలో మనం ఉండకూడదు’’ అని నమ్మే సిద్ధాంతం దేవాది. అందుకే తన దారికి అడ్డొచ్చిన వారిని అంతమొందించడానికి తుపాకీ చేతబట్టాడు. ఫలితంగా అతను కొందరి దృష్టిలో హీరోగా మారితే.. మరికొందరికి డాన్‌ అయ్యాడు. మరింతకీ అతను కథానాయకుడా? గ్యాంగ్‌స్టరా? అన్నది తెలియాలంటే ‘రణరంగం’ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. శర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రమిది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించారు. కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌ అగర్వాల్‌ కథానాయికలు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన రాగా, ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇందులో శర్వానంద్‌ పాత్ర రెండు భిన్న కోణాల్లో సాగనుంది. ప్రశాంత్‌ పిళ్లై సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.