‘రణరంగం’ సౌండ్ అదిరింది!

యాక్షన్‌ కథాంశంతో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో శర్వానంద్‌ నటిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఇందులో శర్వా గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. తాజాగా ‘సౌండ్‌ కట్‌ ట్రైలర్‌’ను యంగ్‌ హీరో రామ్‌ చరణ్‌ తేజ్‌ రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌లో సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌లో వచ్చే సౌండ్‌ మాత్రమే వినిపిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్‌, కల్యాణి ప్రియదర్శిన్‌ కథానాయికలు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.