‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ ట్రైలర్‌ వచ్చేసింది!
‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన బోల్డ్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ఇప్పుడీ భామ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్ చిత్రం ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’. ‘హుషారు’ చిత్రంతో నటుడిగా పేరు తెచ్చుకున్న తేజుస్‌ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. శంకర్‌ భాను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. ‘నిజంగా మా ఊరి సమస్య తీరుతుందంటే.. ఊరంతా ఆత్మాహుతి చేసుకుంటాం’ అని నరేశ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తి రేపుతుంది. ఆ సమస్య ఏంటి? పాయల్‌ ఎలా పరిష్కరించిందో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. పాయల్‌ చెప్పే డైలాగ్స్‌ అందరిని అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి రదన్‌ స్వరాలు సమకూరుస్తుండగా.. రామ్‌ ప్రసాద్‌ ఛాయాగ్రహణం అందించారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల కానుంది.

                                 

RDX లవ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది ?#RDXLove #PayalRajput @starlingpayal


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.