ఊహలో ఊరేగే గాలంతా..

సుధీర్‌బాబు, అదితిరావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమ్మోహనం’. శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మాత. దర్శకుడు ఇంద్రగంటి శైలిలో వైవిధ్యభరితంగా సాగే సరికొత్త ప్రేమకథతో రూపొందుతోంది చిత్రం. వివేక్‌సాగర్‌ స్వరాలు సమకూర్చారు. చిత్రబృందం శనివారం ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసింది. ‘‘ఊహలో ఊరేగే గాలంతా.. ఇది తారలు దిగివచ్చే వేళంటా..’’ అంటూ సాగే ఈ చక్కటి మెలోడి గీతానికి రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యమందించారు. గాయకులు హరిచరణ్‌, కీర్తన ఆలపించారు. పాట ఆద్యంతం ఎంతో చక్కగా మనసుకు ఆహ్లాదాన్ని పంచే విధంగా వినసొంపైన సంగీతంతో తీర్చిదిద్దారు వివేక్‌సాగర్‌. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. నరేశ్‌, తనికెళ్ల భరణి, పవిత్ర లోకేష్‌, నందు తదితరులు నటించారు. జూన్‌ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

© Sitara 2018.
Powered by WinRace Technologies.