‘సామి స్క్వేర్‌’ యాక్షన్‌ షురూ!

చియాన్‌ విక్రమ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామి స్క్వేర్‌’. 2003లో వచ్చిన ‘సామి’కి సీక్వెల్‌గా దర్శకుడు హరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. పోలీసు అధికారిగా విక్రమ్‌ పలికిన పవర్‌ఫుల్‌ సంభాషణలు, పోరాట సన్నివేశాలు ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ‘‘నేను పోలీసును కాదు.. పోకిరిని’’, ‘‘మత్య్స స్వామి, కూర్మస్వామి, వరహా స్వామి, నరసింహస్వామి, రావణ స్వామి’’ అంటూ విక్రమ్‌ పలికిన సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకోని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
© Sitara 2018.
Powered by WinRace Technologies.