అమ్మాయిలకు సైట్‌ కొడుతున్న ‘మహర్షి’
                                                                

మహేష్‌బాబు తన 43వ పుట్టిన రోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాలు  అభిమానుల కోలాహలంతో  జన్మదిన  శుభాకాంక్షల  సందేశాలతో బిజీగా ఉన్నాయి. మహేష్‌ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ చిత్రం ‘మహర్షి’ లో నటిస్తున్నారు. ఈచిత్రం చిత్రీకరణ జరుపుకొంటోంది. మహేష్‌బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ‘మహర్షి’ ప్రచారచిత్రాన్ని, టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో హ్యాండ్సమ్‌ లుక్‌లో కాలేజీ విద్యార్థిగా చేతిలో ల్యాప్‌టాప్‌తో కాలేజీ అమ్మాయిలకు సైట్‌ కొడుతూ ఉత్సాహంగా కనిపిస్తున్న సన్నివేశం హషారు కలిగిస్తోంది. ‘భరత్‌ అను నేను’ చిత్రం తరువాత మహేష్‌ నటిస్తున్న చిత్రం ఇది. వచ్చే ఏడాది ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.