ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కేజీఎఫ్‌’ట్రైలర్‌

ష్,శ్రీనిధిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ గురు దర్శకత్వంలో రూపొందుతోంది. విజయ్‌ కిరంగధూర్‌ నిర్మాత. కోలార్‌ బంగారు గనులు (కేజీఎఫ్‌) ఇతివృత్తంగా సాగనుందీ చిత్ర కథ. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. తాజాగా హిందీ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌లోని పోరాట దృశ్యాలు ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి.గనులు వ్యక్తుల చేతుల్లోకి వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చిత్రీకరించారు. కథానాయిక తమన్నా ప్రత్యేక గీతం చిత్ర ప్రత్యేక ఆకర్షణ. డిసెంబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

                                 

© Sitara 2018.
Powered by WinRace Technologies.