‘సైరా నరసింహారెడ్డి’ గురువు వీరే..

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్నారు. నయనతార కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్‌ నిర్మాత. సురేఖ కొణిదెల సమర్పిస్తున్నారు. ఈరోజు అమితాబ్‌ 76వ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్ర బృందం ఆయన ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో అమితాబ్‌ గోసాయి వెంకన్న పాత్రలో కన్పించబోతున్నారు. ఇందులో ఆయన నరసింహారెడ్డికి గురువుగా నటించారు. ఈ పాత్రలో అమితాబ్‌ ఒదిగిపోయారు. ఈ ప్రచార చిత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్‌ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం జార్జియాలో కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌ ముగసిన తర్వాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ మొదలవుతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.© Sitara 2018.
Powered by WinRace Technologies.