‘సైరా’పై పవర్‌స్టార్‌ ముద్ర ఇదుగో..

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సైరా’ టీజర్‌ వచ్చేస్తోంది. ఆగస్టు 20న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాత, రామ్‌చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. దీంతో పాటు టీజర్‌ రిలీజ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా ‘సైరా’ టీం నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ చిత్ర టీజర్‌కు చిరంజీవి సోదరుడు, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ప్రోమోను విడుదల చేశారు. పవన్‌ తన కారులో డబ్బింగ్‌ స్టూడియోలోకి ప్రవేశించడం, తన అన్న చిరును ఆత్మీయంగా కౌగిలించుకోవడం, ఆయన పక్కన ఉండగానే టీజర్‌కు వాయిస్‌ ఓవర్‌ అందించడం వంటి సన్నివేశాలను ఈ ప్రోమోలో చూపించారు. ముఖ్యంగా ‘‘సైరా నరసింహారెడ్డి’’ అంటూ చివర్లో పవన్‌ చెయ్యి పైకెత్తి జైకొట్టిన తీరు ప్రోమోకే హైలైట్‌గా నిలిచింది.





Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.