అతడే మాలో ధైర్యం దొర!

గటు సినీ అభిమాలతోపాటు చిత్ర పరిశ్రమ సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘సైరా’ ట్రైలర్‌ వచ్చేసింది. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు కానుకగా రెండు రోజుల ముందే విడుదల చేశారు. ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవితగాథతో తెరకెక్కుతుందీ చిత్రం. కాగా ఈ ట్రైలర్‌కు ప్రముఖ నటుడు, చిరంజీవి సోదరుడు పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తున్నాడనే వార్త తెలిసినప్పటి నుంచి అంచనాలు ఆకాశాన్నంటాయి. అంచనాలకు తగ్గట్టునే దర్శనమిచ్చాడు ‘సైరా’. పోరాట సన్నివేశంలో వచ్చే ‘అతడే మాలో ధైర్యం దొర’ డైలాగ్‌ రోమాలు నిక్కబొడుస్తుంది. అమితాబ్‌ బచ్చన్, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై నటుడు రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకడు సురేందర్‌ రెడ్డి. అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

                           


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.