ఆకట్టుకుంటోన్న తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ ట్రైలర్‌

తె
లుగులో విజ‌య‌వంత‌మైన `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని త‌మిళలో ‘ఆదిత్య వర్మ’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో వెండితెరపైకి పరిచయం కాబోతున్నారు తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌. భణిత సంధు ధృవ్‌కు జోడీగా నటిస్తోంది. తొలుత ఈ సినిమాను బాలా దర్శకత్వంలో తెరకెక్కించగా.. అవుట్‌పుట్‌ అనుకున్న విధంగా లేకపోవడంతో దాన్ని పక్కకు పెట్టేశారు. అనంతరం ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలను సందీప్‌ వంగా శిష్యుడు గిరీశయ్యకు అప్పగించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలా రూపొందించిన ‘వర్మ’తో పోల్చితే గిరీశయ్య ‘అర్జున్‌రెడ్డి’ ఆత్మను అందిపుచ్చుకోవడంలో చాలా వరకు సఫలీకృతుడయ్యాడనే చెప్పొచ్చు. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’లో ముద్దు సన్నివేశాలకు ఎంతటి ప్రాధాన్యముందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్‌లో వెర్షన్‌లోనూ ఇలాంటి ఘాటైన లిప్‌లాక్‌లకు కొదువలేదు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో నాలుగైదు శాంపిల్స్‌ను కూడా చూపించేశారు. ఇక నటీనటుల విషయానికొస్తే.. ధృవ్‌ ఈ పాత్ర కోసం తన వంతు కృషి చేశాడనే అనిపిస్తోంది. కానీ, కొన్నిచోట్ల అతను ఆ పాత్రకు సరితూగలేదోమో అనిపిస్తుంది. ఇక భణిత సంధు నటన పర్వాలేదనిపించింది. ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలను చూస్తుంటే మాతృకను ఎక్కడా పక్కదారి పట్టించకుండా ఉన్నది ఉన్నట్లుగా తెరపైకి తీసుకొస్తున్నట్లుగా అర్థమవుతోంది. గిరీశయ్య మేకింగ్‌ స్టైల్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.