ఎవడు ఏమనుకుంటే నాకేంటి?
‘‘నా గతాన్ని, నా సమస్యను గుర్తించని ఈ పనికిమాలిన సమాజం నేను చేసింది తప్పు అని ముద్ర వేసింది’’ అంటూ శ్రీవిష్ణు చెబుతున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ‘తిప్పరా మీసం’ ట్రైలర్‌ ఈ సంభాషణతోనే మొదలైంది. ఇందులో గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లో దర్శనమిస్తున్నారు శ్రీవిష్ణు. కథానాయకుడి సంభాషణలు, టేకింగ్, నేపథ్య సంగీతం ప్రచార చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి. తల్లి, కొడుకుల మధ్య సాగే ఎమోషన్‌తో చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ‘’ఎవడు ఏమనుకుంటే నాకేంటి?’’ అనే సంభాషణతో ప్రచారచిత్రం ముగుస్తుంది. దర్శ కనిర్మాత విజయ్‌ కృష్ణ ‘అసుర’ చిత్రం తరువాత దర్శకత్వం వహించిన చిత్రమిది. నవంబర్‌ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.