ఊర మాస్‌ లుక్‌లో అదరగొడుతున్న ‘వాల్మీకి’
హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్ తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో పవర్‌ఫుల్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు వరుణ్‌. ‘అందుకే పెద్దోళ్లు చెప్పిన్రు. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే రెండు కాల్చొకోవాలే. రెండు దాచుకోవాలే’ అని వరుణ్‌ చెప్పే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై నిర్మితమవుతుందీ చిత్రం. శరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకుని సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్దే కథానాయిక.
            
                                   


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.