మామా అల్లుళ్లు అదరగొడుతున్నారుగా




విక్టరీ వెంకటేష్ ఆయన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి తొలిసారి నటిస్తోన్న చిత్రం ‘వెంకీమామ’. ‘జై లవకుశ’ వంటి హిట్‌ తర్వాత దర్శకుడు బాబీ (రవీంద్ర) తెరకెక్కిస్తున్న చిత్రమిది. వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ కనిపించబోతుండగా.. చైతూతో రాశీ ఖన్నా ఆడిపాడబోతుంది. దసరా కానుకగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.వెంకీ బైక్‌పై ఉండే ‘జై జవాన్‌ జై కిసాన్‌’ అనే లోగోతో ప్రారంభయ్యే ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ‘గోదావరిలో ఈత నేర్పా. బరిలో ఆట నేర్పా. ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా అల్లుడ’ని వెంకీ చెప్పే డైలాగ్‌ అదుర్స్‌ అనిపిస్తుంది. తమన్‌ నేపథ్య సంగీతం అలరిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మామా అల్లుళ్ల సందడి మీరూ చూసేయండి...

                               


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.