అందుకే ‘బాషా’ రీమేక్‌ అమితాబ్‌ చేయలేదు

రజనీకాంత్‌ కథానాయకుడుగా నటించిన ‘బాషా’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. మాణిక్‌ బాషా పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రంలో రజనీ చెప్పిన ‘ఈ బాషా ఒక్క సారి చెప్తే వందసార్లు చెప్పినట్లు’.. డైలాగ్‌ సినీ ప్రియుల్ని ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఆటో డ్రైవరైన బాషా గతంలో ఏం చేసేవాడనే? ఆసక్తికర కథాంశంతో దర్శకుడు సురేష్‌ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం. 1995లో విడుదలైన ఈ చిత్రాన్ని మళ్లీ 2013లో తెలుగు, తమిళ భాషల్లో డిజిటల్‌ వెర్షన్‌లో రిలీజ్‌ చేశారంటేనే ఈ చిత్రం ఎంతటి సత్తా చాటిందో అర్థమవుతుంది. ఇంతటి ప్రజాధారణ పొందిన ఈ సినిమాను హిందీలో అమితాబ్‌ బచ్చన్‌తో రీమేక్‌ చేసేందుకు నిర్మాత ప్రసాదరావు హక్కుల్ని దక్కించుకున్నారు. కానీ, అమితాబ్‌ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండటం, గతంలో ఆయన నటించిన ‘హమ్‌’ కథకు ఈ చిత్రం దగ్గరగా ఉండటంతో ‘బాషా’ రీమేక్‌ చేయలేదు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.