అరవింద్‌ స్వామి అవకాశం జగపతికి

ఏ రంగంలోనైనా ఒకరి అవకాశం మరొకరు వస్తుంటుంది. ఇది చిత్ర పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ఏదైనా ఒక నటుడి కోసం రూపొందిన పాత్ర మరో నటుడి చేతిల్లోకి వెళ్లి ప్రాణం పోసుకుంటుంది. ఇలాంటి నేపథ్యంలోనే అరవింద్‌ స్వామి నటించాల్సిన ఓ కీలక పాత్ర జగపతి బాబు ఖాతాలోకి వెళ్లింది. అదే సినిమాలో క్యారెక్టర్‌ అంటే? జూనియర్‌ ఎన్టీయర్‌ కథానాయకుడుగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన ‘నాన్నకు ప్రేమతో’. ఇందులోని కృష్ణమూర్తి పాత్ర ఎంతో కీలకమైంది. ప్రతినాయక ఛాయలున్న ఈ పాత్రలో నటించేందుకు ముందుగా చిత్ర బృందం అరవింద్‌ స్వామిని సంప్రదించిందట. కానీ, అప్పటికే ఆయన తమిళ చిత్రాలతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్టును దక్కించుకోలేదు. దీంతో తెలుగులో అప్పటికే స్టైలిష్‌ విలన్‌గా కొనసాగుతున్న జగపతిని ఎంపిక చేశాడు సుకుమార్‌. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నటుడిగా మరో మెట్టు ఎక్కాడు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.