నిజంగానే ఆమె ‘స్పీడ్‌ గర్ల్‌’!

జీవితం సినిమాను అనుకరిస్తుందా...లేకపోతే, సినిమాయే జీవితాన్ని అనుకరిస్తుందా అనే ప్రశ్న వచ్చి తీరుతుంది నటీమణి బేబ్‌ డేనియల్స్ కథ వింటే! కారును అధికవేగంతో నడిపేందుకు ఆమెకు 1921లో 10 రోజుల జైలు శిక్షను విధించింది కోర్టు. ఆ శిక్ష పూర్తయి, ఆమె జైలునుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమెకు వచ్చిన మొదటి సినిమా ఆఫర్‌ కథ ఏమిటో తెలుసా... కారులో వేగంగా వెడుతూ పోలీసులకు పట్టుబడిపోయి, జైలుకు వెళ్లే ఓ యువతి కథ. అన్నట్లు ఆ సినిమా పేరు కూడా, కథకు తగ్గట్లే ‘ది స్పీడ్‌ గర్ల్‌’! ఈ చిత్రం 1921లో అమెరికాలో విడుదలైంది.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.