తొలి డబ్బింగ్‌ సంగతులు...


దక్షిణ భారతదేశంలో తొలి డబ్బింగ్‌ చిత్రాలు 1948లో ఆరంభమైనాయి. స్టూడియో అధిపతులు, నిర్మాతలూ అయిన ఎ.వి.మొయ్యప్ప చెట్టియార్, ఎస్‌.ఎస్‌.వాసన్‌లు డబ్బింగ్‌కి జననం ఇచ్చారు. వాసన్‌ తను తమిళంలో తీసిన ‘చంద్రలేఖ’ను హిందీకి డబ్‌ చేశారు. ఏవియమ్‌ చెట్టియార్, కన్నడంలో వచ్చిన ‘హరిశ్చంద్ర’ని తమిళభాషకి డబ్బింగ్‌ చేశారు. హిందీలో నిర్మితమై ప్రసిద్ధిగాంచిన ‘రామరాజ్య’ (గాంధిజీ చూసిన ఏకైక చిత్రం అని చెప్పుకుంటారు)ని, తమిళభాషకి అనువదించారు. అలాగే, దక్షిణదేశంలో కంప్యూటరైజ్‌డ్‌ డబ్బింగ్‌ని, తొలిసారిగా ఆరంభించినదీ (1981) ఎవిఎమ్‌ చెట్టియారే.                                                                                                                                                        -రావి కొండలరావు


© Sitara 2018.
Powered by WinRace Technologies.