ఆడవాళ్లు అక్కడికి వెళ్లకూడదా!
ఆ రోజుల్లో వింతగా చెప్పుకున్న విషయం ఒకటుంది. ఆర్‌.నాగేశ్వరరావు (విలన్‌ పాత్రధారి) గుండె జబ్బుతో చనిపోతే, సినిమావారు చాలా మంది వెళ్లి అంతిమ దర్శనం చేసుకున్నారు. సావిత్రి, వరలక్ష్మి, జానకి మొదలైన నటీమణులు కూడా చాలాసేపు కూచున్నారు. ఎల్డామ్స్‌ రోడ్డులోని అతని నివాసం నుంచి, శ్మశానానికి బయల్దేరుతున్నప్పుడు సినిమా ప్రముఖులు అనేకులు వెంటవెళ్లారు. స్త్రీలు శ్మశానానికి వెళ్లకూడదు; వెళ్లరు. కానీ, జి.వరలక్ష్మి మాత్రం ఒక్కతే వెళ్లింది! భౌతికకాయాన్ని చితిమీద పడుకోబెట్టి, ఉన్నవాళ్లంతా నోట్లో బియ్యంగింజలు వెయ్యవలసివచ్చినప్పుడు వరలక్ష్మి కూడా వెళ్లి బియ్యం గింజలు వేసింది. ఈ విషయం గురించి, ఆ మర్నాడు అందరూ ఆశ్చర్యంగా చెప్పుకున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.