‘ఘంటసాల’ ఊరు

హిందీ చిత్రాల్లో ఎన్నో పాటలు పాడిన ముఖేష్‌కి బొంబాయి నగరపాలక సంఘం గొప్ప గౌరవం చూపించింది. ఆయన మరణాంతరం, ఆయన నివసించిన ఇంటికి దగ్గర్లో వున్న నాలుగురోడ్ల కూడలికి ఆయన పేరు పెట్టింది. ‘గాయక్‌ ముఖేష్‌ చౌక్‌’ అని. రష్యా దేశంలో ఒక వీధిపేరు, ముఖేష్‌ పేరుతో ఉందట! మన రాష్ట్రంలో ఘంటసాలకు ఎన్నో ఊళ్లలో విగ్రహాలు ఉన్నాయి. ఒక్క విశాఖపట్నంలోనే మూడు వేర్వేరు స్థలాల్లో మూడు విగ్రహాలు ఉన్నాయి. ఆయన పుట్టిన ఊరు చౌటుపల్లి. ఆయన బాల్యం అక్కడే గడిచింది. చౌటుపల్లి అన్న ఆ ఊరి పేరును ‘ఘంటసాల’గా మార్చాలని, ఆలోచిస్తున్నారు ఆ ఊరి పెద్దలు. అయితే, ఘంటసాల పేరుతో ఒక ఊరుందిగాని, ఆయనకేం సంబంధం లేదు.


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.