ఏక చిత్ర కథానాయకుడు

1938లో ‘గృహలక్ష్మి’ వచ్చింది. రోహిణీ వారిది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి దర్శకుడు. ఇందులో హీరో కొత్తనటుడు. ఆయన పేరు రామానుజాచార్య. తెనాలిలో అడ్వకేటు. రంగస్థలం మీద గిరీశం పాత్ర అద్భుతంగా నటించేవాడని, ఆయన్ని తీసుకున్నారు. ‘గృహలక్ష్మి’లో నాయిక కన్నాంబ. రామానుజాచార్య బాగానే నటించాడని పేరు వచ్చినా, మళ్లీ ఆయన ఇంకే చిత్రంలోనూ నటించలేదు. ‘గృహలక్ష్మి’ ఘనమైన విజయం సాధించడంతో రామానుజాచార్యకి అభిమానులు ఎక్కువగా ఉండేవారు. అయితే సినిమాలు వద్దని ఆయనే అనుకున్నారో, సినిమా వాళ్లే వద్దనుకున్నారో తెలీదు. చిత్తూరు వి.నాగయ్యకి ‘గృహలక్ష్మి’ తొలిచిత్రం. ఈ చిత్రం తరువాత, వాహిని చిత్రాల్లో ఆయనే హీరో.


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.