జగతల ప్రతాపన్‌... అద్భుతం!

తెలుగులో ఘనవిజయం సాధించిన విజయవారి ‘జగదేకవీరునికథ’ (కె.వి.రెడ్డి-1961)కి మూలం తమిళంలో వచ్చిన ‘జగతల ప్రతాపన్‌’ (1944) చిత్రం. పి.యు.చిన్నప్ప నాయక పాత్రధారి. కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియో అధిపతి శ్రీరాములు నాయుడు దర్శకుడు. తెలుగులో ‘శివశంకరి’ పాట ఉన్నట్టుగానే, ఆ సినిమాలోను ఉంది. ఐదుగురు చిన్నప్పలు ఒకే ఫ్రేములో ఐదు వాయిద్యాలు వాయిస్తూ పాడడం చూసి ప్రేక్షకులు విస్తుపోయారు! చిన్నప్ప తనకి తానుగా పాడుకునే నటుడు. ‘భాగవతార్‌’ అంటారు ఆయన్ని. ఆ సినిమా ఆ రోజుల్లో పెద్ద హిట్టు. చిత్రం నిడివి మూడు గంటల నాలుగు నిమిషాలు.


- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.