నిజం పామునే వెయ్యండి

యా పిక్చర్స్‌ పేరుతో మీర్జాపురం రాజా కొన్ని చిత్రాలు తీశాక, మద్రాసులోని అళ్వారుపేటలో కొన్ని ఎకరాలు కొని, శోభనాచల స్టూడియో నిర్మించారు. వారి గ్రామంలోని శోభనాచలేశ్వరుడు, వారి కుటుంబానికి ఆరాధ్యదైవం. అంచేత అదే పేరుతో స్టూడియోకీ, తన కంపెనీకి పెట్టారు మీర్జాపురం రాజా. శోభనాచల తొలి చిత్రం ‘దక్షయజ్ఞం’ (1941) చిత్రపు నారాయణమూర్తి దర్శకుడు. వేమూరు గగ్గయ్య, కృష్ణవేణి, బెజవాడ రాజరత్నం ముఖ్యనటులు. ‘ఢంకా’ అనే పత్రిక సంపాదకుడు ‘ఢంకాచారి’గా ప్రసిద్ధుడు. ఆయన ఆ సినిమాకి రచన చేశారు. మస్తానయ్య అనే రంగస్థల నటుడు శివుడి వేషం వేశాడు. అతని మెడలో రబ్బరు పాము వెయ్యబోతే, ‘‘వద్దు - నిజమైన పామునే తీసుకురండి. వేసుకుంటాను’’ అన్నాడు. నోరు కుట్టేసిన నాగుపాముని తెచ్చి, మెడలో వేశారు. ఆ వేషం వేసిన తరువాత అతను పేరు మార్చుకున్నాడు - సదాశివరావు అని. అటు తరువాత శివుడి వేషం ఉంటే, అతన్నే పిలిచేవారు. ‘బాలరాజు’, ‘గుణసుందరి కథ’, ‘ధర్మాంగద’ మొదలైన చిత్రాల్లో అతడే శివుడి పాత్రధారి.



- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.